శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  – కొఠారి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం

వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపుతామని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా మాట ఇచ్చానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానంద, పార్లమెంటు సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ కె.హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గ్రామ సర్పంచ్ మడావి సంపాబాయిలతో కలిసి ప్రారంభించి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆదివాసీగూడేలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించిందని, రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని గూడేలు, ఆదివాసీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడినుండి ప్రారంభిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనున్నట్లు చెప్పారు. సామÖహిక గృహ ప్రవేశాల అనంతరం ఆయన ఇండ్ల లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో లక్షమంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. ఏ గూడెంలోనూ ఇండ్లు లేని పేదలు ఉండకూడదని, రాష్ట్రంలోని గూడేల్లో ఒక్క గుడిసె కూడా కనిపించొద్దని, పక్కా ఇండ్లు ఉండాలని అన్నారు. ఆదివాసి బిడ్డలందరికీ ప్రభుత్వం నుంచి అమలు చేసే ప్రతి పథకాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని గూడాలు, ఆదివాసి ప్రాంతాలలో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఇదే తేదీన అన్ని గూడేల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించుకుని పండుగ చేసుకుందామన్నారు. గూడేల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచిస్తున్నానన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆదివాసీ, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి.. పాత ఇందిరమ్మ ఇండ్లకు గోడలు బాగున్నా పైకప్పు పాడై కొందరు ఇబ్బందులు పడుతున్నారు.. అలాంటి వారికి స్లాబ్ వేసుకునేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని మంత్రికి సూచించారు. మీ అందరినీ చూస్తుంటే దసరా పండగకు వచ్చినట్లుగా ఉందన్నారు. మీ సంతోషం కంటే మాకు ఎక్కువ ఏదీ కాదన్నారు. మహిళలను ఇంటి పెద్దగా గుర్తించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్నున్నామని వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళల రుణ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను వివిధ వ్యాపార రంగాలలో భాగస్వాములను చేస్తున్నామని, మహిళలను బస్సులకు యజమానులను చేస్తూ రాష్ట్రంలో వేయి బస్సులను కేటాయించామని, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలకు అవకాశం కల్పించి ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రోత్సహిస్తున్నామని కూడా చెప్పారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హత గల ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నామంటూ ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఇల్లు నిర్మించుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో విద్య ఎంతో అవసరమని, అందరూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుని పిల్లల్ని బాగా చదివించుకోవాలని, చదువుతోనే మీ జీవితాల్లో మార్పు వస్తుంది.. వెలుగులు తెస్తుంది.. అందరూ మీ పిల్లల్ని చదివిస్తామని నాకు మాట ఇవ్వండి.. వాళ్లు బాగుంటేనే మీ జీవితాలు బాగుపడుతాయి అని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు