పేదవాడికి ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ ఎం వి కోటిరెడ్డి…

*పేదవాడికి ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ ఎం వి కోటిరెడ్డి

*హోమియో వైద్యానికి గుర్తింపు తీసుకువచ్చిన డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు.

*బండారు చందర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కోటిరెడ్డి డాక్టర్ వెంకటేశ్వరరావు లకు ఘన సన్మానం.

*చిన్నతనంలో అనుభవించిన పేదరికమే ఈ స్థాయిలో నిలబెట్టింది.

*డాక్టర్ ఎం వి కోటిరెడ్డి.

*పరిసర ప్రాంతాలే మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

*డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు.

భద్రాచలం జూన్ 2 : టుడే 9 ప్రతినిధి

పేదవాడికి ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత డాక్టర్ ఏమీ కోటిరెడ్డి కి దక్కుతుందని జిల్లా ట్రస్ట్ ల బాధ్యులు ఎంబీ నర్సారెడ్డి కొలగాని బ్రహ్మచారి లు అన్నారు. హోమియో వైద్యానికి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు కి దక్కుతుందని వారు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక చందర్రావు భవనంలో బండారు చందర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల పదవి విరమణ పొందిన డాక్టర్ ఎం వి కోటిరెడ్డి డాక్టర్ హోమియో వెంకటేశ్వరరావు లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండారు చందర్రావు చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ బండారు శరత్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ నర్సారెడ్డి బ్రహ్మచార్యులు మాట్లాడారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్గా సేవలందించిన ఎంవీ కోటిరెడ్డి ఎన్నో వందల నార్మల్ డెలివరీ లో నిర్వహించి అనేక అవార్డులను సాధించారని గుర్తు చేశారు. డాక్టర్ కోటిరెడ్డి హయాంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అనేక రకాల ప్రోత్సాహాలు లభించాయని అన్నారు. వంద పడకలుగా ఉన్న ప్రభుత్వ ఏరియాస్పత్రిని 200 పడకలుగా అప్డేట్ చేపించడంలో డాక్టర్ కోటిరెడ్డి కృషి మరువలేనిదని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా భద్రాచలం అంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ హోమియో వైద్యా అభివృద్ధికి డాక్టర్ వెంకటేశ్వరరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. రోగులతో అధిక సమయాన్ని గడిపి వారి సమస్యలను కులం కుశంగా ఆలకించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని నింపడంలో వెంకటేశ్వరరావు తన ప్రత్యేకతను చాటారని అన్నారు. భద్రాచలం కేంద్రంగా హోమియో ఆయుర్వేదిక్ యోగ సేవలను పెంపొందించడంలో డాక్టర్ వెంకటేశ్వరరావు నిరంతరాయంగా కృషి చేశారని అన్నారు.

చిన్నతనంలో అనుభవించిన పేదరికమే నన్ను ఇ స్థాయిలో నిలబెట్టింది…డాక్టర్ ఎం వి కోటిరెడ్డి.

గుంటూరు జిల్లా మారుమూల గ్రామంలో విద్యను అభ్యసించే వయసులో అమ్మా నాన్నతో కలిసి కూలి పనికి సైతం వెళ్లి పొట్ట నింపుకున్న పేదరికమే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది అని డాక్టర్ ఎం.వి కోటిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైద్యం కోసం పేదరికంలో నా తల్లిదండ్రులు అనుభవించిన బాధలను ప్రత్యక్షంగా చూశాను కాబట్టే పేదవాడికి మెరుగైన ప్రభుత్వ వైద్యాన్ని అందించగలిగానని అన్నారు. నా 30 ఏళ్ల సర్వీసులో ఎంతోమంది పేదలకు అత్యాధునితమైన వైద్యం అందించి వారి ముఖంలో చిరునవ్వుని చూడగలిగానని అన్నారు. ఆ పేదల ఆశీస్సులే నన్ను మూడుసార్లు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాయని డాక్టర్ కోటిరెడ్డి అన్నారు. వైద్య వృత్తికి విరామం ఉండదని ఉద్యోగ విరమణ అనంతరం వైద్య సేవలు కొనసాగిస్తానని ఏమీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.

పరిసర ప్రాంతాలే మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి…హోమియో వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటేశ్వర్రావు.

మనం పెరిగిన పరిసర ప్రాంతాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయని ఈ ప్రాంతంలో విద్యను అభ్యసించాను కాబట్టే మొదటి నుండి సామాజిక సేవ భావాలు అలుమర్చుకున్నానని డాక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. చదువుకునే రోజుల్లో అలోపతి వైద్యాన్ని అభ్యసించాలనుకున్నప్పటికీ కాలేజీ ఫీజు 12000 రూపాయలు చెల్లించలేక వైద్య సీటును కోల్పోయానని డాక్టర్ వెంకటేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హోమియో వైద్య విద్యను అభ్యసించి ఈ ప్రాంత ప్రజలకు హోమియో వైద్యంపై నమ్మకాన్ని కలిగించగలిగానని అన్నారు. వైద్య వృత్తికి విరామం అనేది ఉండదని పదవీ విరామణ పొందినప్పటికీ ఈ ప్రాంత ప్రజల కోసం హోమియో వైద్య సేవలను అందిస్తూనే ఉంటానని అన్నారు. భవిష్యత్తులో బండారు చందర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్ వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సిపిఐ ఎం సీనియర్ నాయకులు జిఎస్ శంకర్ రావు సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు డి సీతాలక్ష్మి సీనియర్ నాయకులు బి బి జి తిలక్ తదితరులు మాట్లాడి ఇరువురు వైద్య దంపతులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చములు అందించారు. ఈ కార్యక్రమంలో పారెల్లి సంతోష్ కుమార్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బండారు చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నాదెండ్ల లీలావతి నకిరేకంటి నాగరాజు కుంజా శ్రీనివాస్ కనక . సండ్ర భూపేంద్ర ట్రస్ట్ సభ్యులు ఎర్రం శెట్టి పూర్ణిమ సీతారామరాజు దారిశెట్టి సతీష్ బాబు ఎం వి ఎస్ నారాయణ నరసింహారెడ్డి ఎం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు