- మణుగూరులో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
- పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి – లోతట్టు ప్రాంతాల డ్రైనేజీల పరిశీలన
Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
పురపాలక సంఘం కమిషనర్ ఈరోజు తన రోజువారి బస్తీల పర్యవేక్షణలో భాగంగా మణుగూరులోని శ్రీ శ్రీ నగర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి పరిసరాల పరిశుభ్రతపై తగు సూచనలు చేశారు. డ్రైనేజీలను దగ్గరుండి పరిశీలించి మురికి నీరు, వరద నీరు ఎక్కడెక్కడ ఆగుతున్నాయో గుర్తించారు. వెంటనే వాటిని శుభ్రపరచాలని సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్‌ను ఆదేశించారు.
అనంతరం సుందరయ్య నగర్ లోతట్టు ప్రాంతం, వినాయక నగర్ వీధుల్లో కూడా కలియ తిరిగారు. కొత్త డ్రైనేజీలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడక్కడ ఉన్న ఎత్తుపల్లాలను సరిచేయాలని, నీరు నిలవకుండా కాలువలోకి జారేలా చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.
శ్రీ శ్రీ నగర్ మూలమలుపు వద్ద హైడ్రోజన్ ల్యాంప్స్ మరియు కల్వర్టు ఇరువైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
చాలా సంవత్సరాల తర్వాత కమిషనరే స్వయంగా గల్లీల్లోకి వెళ్లి పారిశుద్ధ్య లోపాలను పరిశీలించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.









