కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ప్రజా సమస్యల పై బి ఆర్ ఎస్ దశల వారి ఆందోళనకు సిద్ధం….

ప్రజా సమస్యల పై బి ఆర్ ఎస్ దశల వారి ఆందోళనకు సిద్ధం….

జెండాను ఆవిష్కరించి  పోరాడేందుకు పిలుపునిచ్చిన రావులపల్లి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అక్టోబర్ 26: టుడే 9 ప్రతినిధి

ప్రజా సమస్యలపై బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనకు సిద్ధం కావాలని ఆ పార్టీ జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు, కాంగ్రెస్ పార్టీ  మాయమాటలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని  రావులపల్లి రాంప్రసాద్ దుయ్యబట్టారు

ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని రావులపల్లి ఆవిష్కరించిన సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం రూపకల్పన చేయాలని. భద్రాచలం పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం దశల వారి ఆందోళనకు శ్రీకారం చుట్టాలని, పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమల కోసం, ముఖ్యంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకై  ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు..
కార్యక్రమంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, అయినాల రామకృష్ణ, రావూరి రవి కిరణ్, కొలిపాక శివ, పసుపులేటి రమేష్, బాడిస నాగరాజు, బాసిపోయిన మోహన్ రావు,కల్లూరి శ్రీరాములు, అంబటి కర్ర కృష్ణ, మురాల డానియల్ ప్రదీప్, జక్కం గోపి, గొల్ల మన్మధరావు,ముత్యాల దినేష్ బాబు, మహిళా విభాగం నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, రవి కుమారి, తెల్లం కామేశ్వరి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు