బ్రిక్స్‌ సదస్సుకు ఇరాన్‌ అధ్యక్షుడు.. త్వరలో భారత్‌కు మసూద్‌ పెజిష్కియాన్‌

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇరాన్‌ అధ్యక్షుడి రాకకు ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెజిష్కియాన్‌ భారత్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. బ్రిక్స్‌ వేదికగా ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక అంశాలు, అంతర్జాతీయ సహకారంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడి భాగస్వామ్యం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్‌, ఇరాన్‌ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన మరింత కీలకంగా మారింది. ప్రాంతీయ పరిణామాలు, వాణిజ్యం, ఆర్థిక సహకారం, పశ్చిమాసియా పరిస్థితులపై ఇరు దేశాల మధ్య చర్చలకు ఈ పర్యటన వేదికగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు