శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటిడిఏ పీవో…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం నంబరు 13
టుడే 9 ప్రతినిధి

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనం అందించి ఈ నెలలో జరిగే క్రీడలలో పాల్గొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు. గురువారం నాడు దుమ్ముగూడెం మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని పరిసరాలు వంటగది సామాన్లు నిలువ చేసే స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్, పిల్లలకు వండిన ఆహారాన్ని పరిశీలించి, సరదాగా పిల్లలతో వాలీబాల్ ఆడారు. నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారము సమయానుకూలంగా ఆహార పదార్థాలు అందిస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఆ అనంతరం పీవో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మెనూ ప్రకారం మంచి పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నందున విద్యార్థులు చదువుతో పాటు వివిధ క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలలో వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని, వంట చేసిన తర్వాత విద్యార్థులకు సరఫరా చేసేముందు ఉపాధ్యాయులు, పనిచేసే సిబ్బంది తిన్న తర్వాతనే వారికి వడ్డించాలని సూచించారు..విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్లకూడదని, ఖాళీ సమయాలలో కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన చార్టులు పరిశీలించి భవిష్యత్తులో మీరు ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఇప్పటినుంచే ప్రిపేర్ కావాలని విద్యార్థులకు సూచించారు. సంబంధిత పిఈటీలు విద్యార్థులకు ఇష్టమైన క్రీడలలో తర్ఫీదు ఇచ్చి ఈ నెలలో జరిగే క్రీడలలో పాల్గొనేలా చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, హెచ్ఎం సోమశేఖర్ . సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు