బతుకమ్మ, దసరా పండుగలు, మహర్నవమి ఐచ్ఛిక సెలవు నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 19న ఐడీఓసీ (IDOC)లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయినందున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్కు రావాలనుకునే వారు ఆ రోజు రావద్దని స్పష్టం చేశారు.
తదుపరి సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ కే. హైమావతి వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆమె కోరారు.
Post Views: 1









