డీప్‌ఫేక్ వీడియోలపై నేహా శర్మ ఫైర్.. ఫేక్ కంటెంట్ తొలగించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సినీ తారల ముఖాలను ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో ‘చిరుత’ సినిమాతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి నేహా శర్మ కూడా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడినట్లు వెల్లడించారు.

తన అనుమతి లేకుండా తన ముఖాన్ని ఉపయోగించి ఏఐ ద్వారా నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించడంపై నేహా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇలాంటి కంటెంట్‌ను తయారు చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలకు తాను ఎలాంటి సమ్మతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

తన ముఖంతో సృష్టించిన నకిలీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని నేహా శర్మ హెచ్చరించారు. ఇలాంటి వీడియోలను రూపొందించడం, వాటిని ఇతరులకు షేర్ చేయడం తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించడాన్ని సహించబోనని ఆమె చేసిన హెచ్చరిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు