విదేశీయుల వివరాలు 24 గంటల్లో నమోదు చేయాలి, ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు : వరంగల్ సిపి

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, అద్దె గృహాల యజమానులు, విద్యా, వైద్య సంస్థల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు 
విదేశీ పౌరులు, OCI కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశస్థులు సహా విదేశీయుల రాకపోకల వివరాలను వారు వచ్చిన లేదా వెళ్లిన 24 గంటల్లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని సెక్షన్ 8 ప్రకారం గతంలో ఫారమ్–Cగా పిలిచే ఫారమ్–III ద్వారా వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని తేల్చి చెప్పారు .
ఇది ఇలా ఉంటే వివరాలను సకాలంలో నమోదు చేయకపోతే సెక్షన్ 23(బి) ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత, వాణిజ్య వసతి నిర్వాహకులకు ప్రతి ఉల్లంఘనకు కనీసం రూ.50,000 జరిమానా విధించే అవకాశం ఉందన్నారు సీపీ .
విద్యా, వైద్య సంస్థలకు ప్రతి ఉల్లంఘనకు కనీసం రూ.1 లక్ష జరిమానాతో పాటు నేర విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిబంధనల అమలుపై నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు