కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 23
టుడే 9 ప్రతినిధి

నవంబర్ 24న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయండి ప్రజలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఆర్ గ్యారంటీల హామీ తో పాటు అనేక వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా డిసెంబర్ 9న సంబరాలు మారుమోగుతాయేమోగాని ప్రజల బతుకులు మాత్రం మారలేదు అని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇల్లు ఆడబిడ్డలకు 2500 రూపాయలు వద్ద పెన్షన్లు 4000 రూపాయలు పెంచటం వికలాంగులకు 3000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచడం రైతు రుణాలు రద్దు ఆటో కార్మికులకు వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల జీవన వృత్తి నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి పంటలకు బోనస్సు సకాలంలో చెల్లించటం వంటి హామీలు అమలు అమలు కాలేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇది చాలా అన్యాయమని అన్నారు అలాగే ఈ సంవత్సరం అతిగా వర్షాలు కురవటం వల్ల పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు నష్టపోయిన ఈ సమయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోగా పంటల బీమాను అమలు చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. పండిన కొద్దిపాటి పంటలను కొనుగోలు చేయటానికి నిబంధనల పేరుతో రైతులను ముప్పు తిప్పలు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ .రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 24వ తేదీన కలెటరేట్లు ముందు ధర్నాలు ప్రదర్శనలు జరపమని పిలుపునిచ్చిందని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని నిర్ణయించిందని ఆయన తెలియజేశారు. ఈ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు రైతాంగము అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని.ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కెచ్చల రంగారెడ్డి పిలుపునిచ్చారు ఈరోజు భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో సిపిఐంల్ మాసలైన్. పార్టీ ప్రజాపంధ పార్టీ ఆఫీసులో ఆ సమస్యపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు .

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కచ్చల కల్పన డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల శివ ప్రశాంత్, మునిగిల మహేశ్వరి, భాస్కరు, కుమారి, శారద, శాంతక్క, రామ, పిరదోసు, షకీరా ,నసీమా, కృష్ణకుమారి, గౌతము తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు