శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  సిరిసిల్ల జిల్లాలో తల్లి కొడుకుల ఆత్మహత్య…

తన మానసిక స్థితి బాగాలేకపోవటంతో నదిలో తల్లి దూకగా..ఆవేదనతో అదే నదిలో దూకి కొడుకు(పోలీస్ కానిస్టేబుల్) ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, తన తల్లి మంచికట్ల లలిత(56)తో నివాసం ఉంటున్నారు అభిలాష్(34) ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తల్లి కనిపించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన అభిలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరుసటి రోజు శుక్రవారం ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని మానేరు నదిలో లభించిన మహిళ మృతదేహం తన తల్లిదేనని గుర్తించి, తీవ్ర మనస్తాపానికి గురైన అభిలాష్ బంధువుల ముందు అదే నదిలో దూకేశారు.దాదాపు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేసిన అనంతరం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అభిలాష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు