కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

* మంత్రి జూపల్లిని తప్పించే అవకాశం?

*కొండాసురేఖ ప్లేస్ లో ఉత్తమ్ పద్మావతి?

రాష్ట్రంలో మంత్రివర్గ మార్పు తప్పదా ? అంటే అవుననే సమాధానం కొన్ని వర్గాల నుండి వినవస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు మాటలు వినవస్తున్నాయి. ఇది ఇంకో వారం పది రోజుల్లో జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి… ఇందులో భాగంగా నలుగురు లేదా ఐదుగురు మంత్రుల్ని తప్పించే అవకాశం లేకపోలేదనే… గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి…. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న …కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలియ వచ్చింది. రవాణా శాఖామంత్రి పొన్నం స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ కు చోటు కల్పించనున్నారు అని కొందరు నేతల నుండి మాటలు వినవస్తున్నాయి.. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఛాన్స్ కల్పించనున్నట్టు తన పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక నాయకుడు తెలియజేశారు. టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును తీసుకొని ,పీసీసీ చీఫ్ గా హోంమంత్రిగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం అందుతోంది.ఇది ఇలా ఉంటే కేవలం పుకార్లు మాత్రమేనా లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది కార్యరూపం దాల్చుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు