కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  తమిళనాడులో ‘విజయ్’ ప్రభంజనం: మ్యాజిక్ ఫిగర్ దిశగా టీవీకే.. ద్రవిడ కోటలో దళపతి పాగా!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ ద్రవిడ రాజకీయాల్లో తన ముద్ర వేస్తున్నారు. తాజా కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, టీవీకే ఏకంగా 108 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతూ అధికారానికి చేరువలో ఉంది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మెజార్టీకి (మ్యాజిక్ ఫిగర్) టీవీకే కేవలం పది స్థానాల దూరంలో ఉంది. చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డీఎంకే గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, మిగిలిన రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విజయ్ అభ్యర్థులు భారీ మెజార్టీలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల ఏకపక్ష మద్దతు విజయ్ పార్టీని విజయతీరాలకు చేరుస్తోంది. ఒకవేళ ఒంటరిగా పూర్తి మెజార్టీ రాకపోతే, ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా విజయ్ టీమ్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు మరియు విజయ్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ‘విజయ్ ఫర్ సీఎం’ అనే నినాదాలతో తమిళనాడు హోరెత్తుతోంది. దశాబ్దాలుగా ఏఐఏడీఎంకే, డీఎంకేల మధ్య సాగుతున్న ద్విముఖ పోటీకి చరమగీతం పాడుతూ, మూడవ ప్రత్యామ్నాయంగా టీవీకే బలోపేతం కావడం జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనుండటంతో దళపతి తదుపరి అడుగుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది ఇలా ఉండగా మిగతా ప్రాధాన్యత గల సర్వే లు ఎగ్జిట్ పోల్స్ ను వెనక్కి నెట్టి యాక్సిస్ మై ఇండియా  నిర్వహించిన ఎగ్జిట్ పోల్ నిజం కావడం గురించి రాజకీయ విశ్లేషకులు ప్రస్తావన చేస్తున్నారు., ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయ డంకా మోగించబోతుందని టుడే 9 న్యూస్ ఈ వార్తను ప్రచురించటం గమనార్హం…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు