కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  డ్రైవర్ లెస్ కారులో మీనా షికార్లు: వైరల్ అవుతున్న వీడియో

ప్రముఖ నటి మీనా డ్రైవర్ లేని ట్యాక్సీలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “మీకు నా డ్రైవర్‌ను పరిచయం చేయనా?” అని మీనా సరదాగా ప్రశ్నిస్తూ, డ్రైవర్ సీటు ఖాళీగా ఉన్న దృశ్యాన్ని కెమెరాలో చూపించారు. టెక్నాలజీని నమ్మి ఈ వినూత్న ప్రయాణాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ అనుభవం అమెరికాలో జరిగి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

ఇక ఆమె సినిమాల విషయానికొస్తే, మీనా ప్రస్తుతం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సరసన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దృశ్యం 3’ చిత్రంలో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా ఈసారి జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) పాత్రలో భయం, ఆందోళన కనిపిస్తుండటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

సెన్సార్ బోర్డు నుంచి U/A 13+ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 2నే విడుదల కావాల్సి ఉంది. అయితే గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం, ‘దృశ్యం 3’ చిత్రాన్ని మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ఈ ఆఖరి పోరాటం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు