కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్!

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా నాలుగున్నర దశాబ్దాల (45 ఏళ్లు) పాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్య ధనమ్మ మే 12వ తేదీన పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వీరిద్దరినీ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్తుతం దాదాపుగా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

2024 నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 822 మంది మావోయిస్టులు 334 ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వివరించారు. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) చేపట్టిందని.. ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాలలో భద్రతా దళాలు జరిపిన నిరంతర కూంబింగ్ ఆపరేషన్ల వల్లే ఈ స్థాయిలో లొంగుబాట్లు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున రివార్డులతో పాటు పూర్తి పునరావాస సదుపాయాలు, అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఛత్తీస్‌గఢ్ నుంచి 15 మంది, ఒడిశా నుంచి 15 మంది, ఝార్ఖండ్ నుంచి 13 మంది ఉండగా.. తెలంగాణకు చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఒక్కరు ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జాడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగులు తక్షణమే లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు