అమెరికా సైనికుడిని పట్టుకుంటే రూ. కోట్ల బహుమతి.. ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ ఇరాన్ సైనిక కమాండర్ అమీర్ హతామీ సంచలన ప్రకటన చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా ఇరానీయులకు 30,000 అమెరికన్ డాలర్ల బహుమతి అందిస్తామని ఆయన ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం.. ఆగస్టు 16న టెహ్రాన్‌లో జరిగిన ప్రసంగంలో అమీర్ హతామీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా సైనికుడిని పట్టుకోవడం లేదా చంపడం జరిగితే ఇరాన్ ప్రజల తరఫున సుమారు 30,000 డాలర్ల బహుమతి అందిస్తామని ఆయన పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది.

ఇరాన్ కరెన్సీలో ఈ మొత్తం సుమారు 5 బిలియన్ టోమన్‌లకు సమానమని హతామీ వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన పరిస్థితిని మరింత సున్నితంగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు