కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఆదివాసీల ఆరోగ్యం అంటే అంత అలుసా…

*ఆదివాసీల ఆరోగ్యం అంటే అంత అలుసా.

*భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించాలి.

*పార్థివ దేహాన్ని భుజాలపై మోసిన స్పందించని మంత్రులు.

*సిబ్బంది కొరతతో నిర్వీర్యం అయిపోతున్న ప్రభుత్వ వైద్యం.

*సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ.

*ఐటిడిఏ ల పై నిర్లక్ష్యం ప్రభుత్వ వైద్యంపై ప్రభావం.

*సగం పైన వైద్య పోస్టుల ఖాళీలతో ఆదివాసీలకు దూరమవుతున్న ప్రభుత్వ వైద్యం.

*సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్.

*ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నీ సందర్శించిన సిపిఐ ఎం బృందం.

*రోగులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర కార్యదర్శ.

భద్రాచలం జూన్ 10
టుడే 9 ప్రతినిధి

ఆదివాసి ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వానికి ఇంత అలుసు ఎందుకని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఒక్కసారి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యాన్ని పరిశీలించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తో పాటు కార్యదర్శి వర్గ సభ్యులు బండారి కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ తదితరుల బృందం భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సందర్శించి పలువురు రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం ఇంచార్జ్ సూపర్ ఇండియన్స్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిరోజు 400 నుండి 600 మంది రోగులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారని అందులో 80 నుండి 90 శాతం ఆదివాసి గిరిజన ప్రజలేనని అన్నారు. వందల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్య సేవలు అందించడానికి కేవలం 19 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 212 మంది వైద్య సిబ్బంది అవసరం కాగా కేవలం వందలోపు మాత్రమే విధుల్లో ఉన్నారంటే ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతుందని అన్నారు. ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ మరమ్మతులు గురై రెండు సంవత్సరాలు కావస్తున్న కనీసం జిల్లా అధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఆ ఫలితంగానే పార్తివదేహాన్ని భుజాలపై మోసుకెళ్ళే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పై కనీసం దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఆస్పత్రి ఆవరణలోని మరుగుదొడ్లకు తలుపులు సైతం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అత్యాధునికమైన స్కానింగ్ ఎక్స్రే పరికరాలు ఉన్నప్పటికీ రేడియాలజిస్ట్ లేక పరీక్షల కోసం ప్రైవేట్ హాస్పటల్ కి వెళ్లాల్సి వస్తుందని జాన్ వెస్లీ విమర్శించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలలో సమగ్ర సర్వే నిర్వహించి వచ్చిన సమస్యలపై ఆగస్టు మొదటి వారంలో హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ వైద్యానికి రాదని తీయకపోతే తీవ్రమైన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
*రోగులను పరామర్శిస్తూ సమస్యలను ప్రస్తావిస్తూ.

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న పలువురు రోగులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిలను ఆరా తీశారు. వారికి అందుతున్న వైద్యం మందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని మరుగుదొడ్లను సైతం స్వయంగా పరిశీలించిన జాన్ వెస్లీ ఆస్పటల్ నిర్వహణలో ఉన్న లోపాలను ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని మందులు బయట మందులు దుకాణాలకు రాస్తున్నారని రోగులు జాన్ వెస్లీకి ఫిర్యాదు చేయగా ఆ అంశాన్ని సైతం రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రానున్న వర్షాకాల సీజన్ నాటికి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు.

*ఐటీడీఏ ల పై నిర్లక్ష్యం ప్రభుత్వ వైద్యంపై ప్రభావం.

*రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్.

ఐటిడిఏ ల పై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యపరితంగానే ఏజెన్సీ ఏరియాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రభావం పడుతుందని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ ఆరోపించారు. భద్రాచలం ఐటిడిఎ పాలకమండలి జరగక మూడు సంవత్సరాలు గడుస్తున్న జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. గతంలో ఐటీడీఏ నుండి వచ్చే నిధులతో హాస్పటల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. నేడు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకుండా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి దిగజారిపోయిన ఐటిడిఏ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సగానికి పైన వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే ఆదివాసి ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని రవికుమార్ ప్రశ్నించారు. గతంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారి పోరాట ఫలితంగా 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుత శాసనసభ్యులు వైద్యుడు అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రేమ లేదని రవికుమార్ ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు తప్పవని రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు సున్నం గంగ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారేల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి 20వ వార్డు నెంబర్ ఇరప అనసూర్య పట్టణ నాయకులు కొలగాని రమేష్ నాదెండ్ల లీలావతి కుంజా శ్రీనివాస్ చాట్ల శ్రీనివాస్ కనక శ్రీ కొరడా శ్రీనివాస్ ధనకొండ రాఘవయ్య నాగరాజు గౌతమి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు