*పార్థీవ దేహాన్ని పరిశోధనకిచ్చి చిరంజీవిగా నిలిచిన మచ్చ కన్నయ్య.
*సిపిఐ ఎం నాయకులు ఏ జె రమేష్ ఎంబీ నర్సారెడ్డి.
*మచ్చ కన్నయ్యకు నివాళులు అర్పించిన సిపిఐ ఎం భద్రాచలం బృందం.
చర్ల జూన్ 10
టుడే 9ప్రతినిధి
తన పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కొరకు మెడికల్ కళాశాలకు అందించడం ద్వారా మచ్చ కన్నయ్య చిరంజీవిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బి నర్సారెడ్డి లు అన్నారు. బుధవారం చర్లలో నిర్వహించిన మచ్చ కన్నయ్య సంస్కరణ సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏజే రమేష్ నరసారెడ్డి లు మాట్లాడుతూ సాంకేతికపరంగా సమాజం అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో మూడ విశ్వాసాలను పక్కనపెట్టి మచ్చ కన్నయ్య మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అందించటం అభినందనీయమని అన్నారు. మచ్చ కన్నయ్య కుమారులైన మచ్చ వెంకటేశ్వర్లు రామారావులు తీసుకున్న ఈ నిర్ణయం ఏజెన్సీ ప్రాంతానికే ఆదర్శమనియమని అన్నారు. పేదరికం నుండి వచ్చిన మచ్చ కన్నయ్య తన కుమారులని ఆదర్శ భావాలతో పెంచారని ఆ ఫలితంగానే నేడు మచ్చ వెంకటేశ్వర్లు సిపిఐఎం జిల్లా కార్యదర్శిగా మచ్చ రామారావు చర్ల మండల కార్యదర్శిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ కాలనీలో నెలకొన్న అనేక సమస్యలపై మచ్చ కన్నయ్య సైతం తనకున్న పరిమితి మేరకు పోరాటాలు నిర్వహించాలని గుర్తు చేశారు. మచ్చ కన్నయ్య స్ఫూర్తితో దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి కుంజా శ్రీను నకిరేకంటి నాగరాజు కనక శ్రీ శేట్ల శ్రీను గౌతమి నాగలక్ష్మి సుబ్బలక్ష్మి భవాని రాము లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు









