భద్రాచలం జూన్ 10
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం పట్టణంలో తేది:08.06.2026 న ఒక దొంగతనం కేసు నమోదు కాగా, డీస్పీ భద్రాచలం ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ యస్ ఐ పి.శ్యాం ప్రసాద్ భద్రాచలం పోలీస్ స్టేషన్ సిబ్బందితో దొంగతనం కేసు విచారణలో బాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు. ఇతర సమాచారాన్ని సేకరించి నిన్న అనగా తేది: 09.06.2026 నాడు డీస్పీ భద్రాచలం ఆదేశాల మేరకు రాత్రి సమయంలో భద్రాచలం పట్టణ యస్ ఐ పి.శ్యాం ప్రసాద్ భద్రాచలం పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా భద్రాచలం ఊరు చివరన వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు వాహనాల తనిఖి చేయుచుండగా నలుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిళ్ళను స్వాదినపర్చుకున్నారు. వారు అంత కూడా నల్గొండ ప్రాంతానికి చెందిన వారు. వీరు అంత కూడా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరు గతంలో హైదరాబాద్, ఖమ్మం మరియు తదితర ప్రాంతాలలో పలు మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినారు. వీరు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను ఓడిస్సా వెళ్లి అక్కడ గంజాయి సరపరా చేసే గంజాయి వ్యాపారులకు ఇట్టి దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు ఇచ్చి వారి వద్ద నుండి గంజాయి తీసుకొని అట్టి గంజాయి రవాణా చేస్తుండేవారు. ఈ క్రమంలో వీరు దొంగతనం చేసిన నాలుగు మోటార్ సైకిళ్ళు వేసుకొని ఓడిస్సా వెళ్లి అక్కడ వీరు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు ఇచ్చి గంజాయి తీసుకొని రావడానికి వెళుతుండగా భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ రోజు నలుగురు దొంగలను భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్యాం ప్రసాద్ గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయస్థానం వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు పంపడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన భద్రాచలం టౌన్ అధికారులను. పోలీస్ సిబ్బందిని భద్రాచలం డీస్పీ అభినందించారు. ప్రజలు తమ వాహనాలను భద్రమైన ప్రదేశాలలో పార్క్ చేయాలని, తాళాలు తప్పనిసరిగా వేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భద్రాచలం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.









