D రమేష్, Today 9news ప్రతినిధి, మణుగూరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా క్యాబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా మణుగూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ,తన సేవాగుణంతో అందరి మన్ననలు పొంది ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రాజకీయ దురంధరుడని,ఆర్యవైశ్య కుల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ఎన్నో కుల సంఘాలకు ఆదర్శప్రాయంగా నిలిచారని శ్లాఘించారు.
ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయిన డాక్టర్ కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి గా, తమిళనాడు గవర్నర్ గా సేవలందించారని, ఆయన 93వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య జాతి తరపున ఘన నివాళులు అర్పించినట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఆర్యవైశ్య మండల అధ్యక్షులు
చిత్తలూరి రమేష్ బాబు, దోసపాటి నాగేశ్వరరావు, కడవెండి విశ్వనాథ్ గుప్తా, దర్శి మధు, రమణ పట్టణ ప్రముఖులు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు…









