- భద్రాచలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహణ
- బెల్ట్ షాపుల నియంత్రణ, ఏరియా ఆసుపత్రి సమస్యలు, గంజాయి నిర్మూలనపై ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్
భద్రాచలం, జూలై 5: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భద్రాచలంలో మండల కార్యవర్గ సమావేశం ఆదివారం బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ *భద్రాచలం మండల ఇంచార్జి తాటి పాముల ఐలయ్య* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా *బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మా మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్న బెల్ట్ షాపుల నియంత్రణకు భద్రాచలం గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, దానిని వంద శాతం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.*
*భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న నిర్లక్ష్య, వివాదాస్పద సంఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, వైద్యుల సంఖ్యను పెంచి 24 గంటలపాటు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.*
*ఇటీవల గంజాయి రవాణాపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీసు శాఖను అభినందిస్తూ, భద్రాచలం పట్టణంలోని అంతర్గత కాలనీల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.*
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, భద్రాచలం మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ములిశెట్టి రాంమోహన్ రావు, బీజేపీ నాయకులు ముత్యాల చంద్రశేఖర్, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల సుబ్బారావు, పి.సి. కేశవ్, అల్లాడి వెంకట సుబ్బారావు, శేర్ శ్రీనివాస్, కనసాని శ్రీనివాస్, జంపాల ప్రభాకర్, గుమ్మల వెంకటేశ్వర్లు, కె. సంధ్య, గార్లపాటి శ్రీను, మండల గురుసాయి తదితరులు పాల్గొన్నారు.









