శాసనసభలో షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా పాయం వెంకటేశ్వర్లు నియామకం
Today 9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ (S T ) చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు రాజకీయ నాయకులు పార్టీ కార్యకర్తలు పాయం వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలియజేశారు. షెడ్యూల్ తెగల సంక్షేమానికి పాయం వెంకటేశ్వర్లు కృషి చేయాలంటూ కోరారు. గిరిజన అభ్యుదయం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యేకు ఈ పదవి మరింత వన్నెతెచ్చిందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు









