భద్రాచలం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కె. విద్యాసాగర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బార్ సభ్యులు…
సంతాప సభలో పాల్గొని నివాళులర్పించిన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ శివ నాయక్…
భద్రాచలం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కె. విద్యాసాగర్ మరణం పట్ల భద్రాచలం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ శివ నాయక్ పాల్గొని దివంగత కె. విద్యాసాగర్ కు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, శ్రీ కె. విద్యాసాగర్ న్యాయవాద వృత్తిలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, ఉన్నత విలువలు, సేవాభావానికి ప్రతీకగా నిలిచి, బార్ అసోసియేషన్ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆదర్శవంతమైన నాయకుడని కొనియాడారు.
ఆయన అందించిన సేవలు భద్రాచలం బార్ అసోసియేషన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఆయన మరణం భద్రాచలం బార్ అసోసియేషన్‌కే కాకుండా యావత్ న్యాయవాద సమాజానికి తీరని లోటని సభలో పాల్గొన్న న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
దివంగత శ్రీ కె. విద్యాసాగర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ భద్రాచలం బార్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ఉపాధ్యక్షులు లు సున్నం రమేష్, జనరల్ సెక్రెటరీ పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీతాత లలిత, కోశాధికారి, దన్నన రాము, లేడీ రిప్రజెంట్, తరుణీ, సీనియర్ న్యాయవాదులు ఎం.వి రామారావు, మాజీ అధ్యక్షులు కోట దేవదానం,ఆర్. కృష్ణకుమారి పలివేల నరసింహారావు , నండూరి శ్రీనివాసరావు, కె.శ్రీమన్నారాయణ,రావి రామ్మోహన్, షేక్. అక్టర్, టి చైతన్య, సోముల గిరిప్రసాద్, పసుపులేటిరాంబాబు , పి. సోమరాజు, చుక్క నాగ అంబేద్కర్,పేరాల వెంకటేశ్వర్లు, పేరాల నాగరాజు, బి. అరుణ్ చంద్, కె. అరుణశ్రీ, కె. ప్రకాష్, నర్మదా, పామరాజు తిరుమలరావు, అవులూరి సత్యనారాయణ, నర్మదా,ఎం.వి. రమ, ఎస్. సతీష్,పి భాస్కరరావు, పులుసు ప్రసాద్,రామ తిరుపతి, ఎస్ మల్లేష్, ఎం. సంధ్యారాణి, వలవల సురేష్ కుమార్, విద్యాదరి, సౌజన్య,బి. శారద, దాట్ల సంధ్య,కొత్తపల్లి రాంబాబు, పూనెం మధు, సోయం కామేష్ తదితర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









