అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి నైనిష ఫౌండేషన్ ఆర్థిక సాయం

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామం, అయోధ్య నగర్ కాలనీ కి చెందిన కట్ట చిరంజీవి అనారోగ్యంతో భద్రాచలం సూర్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో , దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాతలు సాయం అందించవలసిందిగా కోరడంతో కట్ట చిరంజీవి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం..

ఈ కుటుంబం దయనీయ పరిస్థితిని తెలుసుకున్న నైనిష ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, కట్ట చిరంజీవి కి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నైనిష ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండర్ మట్టపల్లి సాగర్ యాదవ్, జర్నలిస్ట్ పోదిల వీరబాబు, అడ్వకేట్ ఈర్ల రాము, జర్నలిస్ట్ మిట్టపల్లి గోపి, సాధిని సీతయ్య, బాణాల కృష్ణ, బానోతు రమేష్ కంపేర్ల నాగేశ్వరరావు, కట్ట మహేష్, తదితరులు పాల్గొన్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు