గిరిజన విద్యాభివృద్ధికి మరో ముందడుగు….

గిరిజన విద్యాభివృద్ధికి మరో ముందడుగ

 

గొందిగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.2.50 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు…

 

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

 

అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలోని బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు *రెవెన్యూ, గృహ నిర్మాణ & సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు* శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించే వాతావరణాన్ని సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.

 

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గంలో విద్యా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ), DCC జిల్లా అధ్యక్షురాలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు