టిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ నక్సలైట్.
ఘనంగా స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత…
జులై 23(TODAY 9)
బోడ.భీముడు ( సుధాకర్). చిన్న తనం నుండి విప్లవ భావాలకు ఆకర్షితుడై గుండాల మండలం పి వై ఎల్ యువజన సంఘం మండల నాయకుడిగా సిపిఐ ఎంఎల్ న్యూ డుమోక్రసీ పార్టీ గ్రామ కమిటీ సభ్యుడిగా కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న కాలంలో. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీకి, ప్రజా ప్రతిఘటన, ప్రతిఘటన విప్లవ గ్రూపుల గొడవలలో కేసుల పాలై జైలు జీవితం గడిపి.2013 సంవత్సరంలో యూజీఐ గుండాల అల్లపల్లి పినపాక టేకులపల్లి ఏరియా దళ కమాండర్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ నాయకుడిగా పనిచే ఇస్తున్న కాలంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో ఏర్పడ్డ గోడవలకు విసిగిపోయి, ఉద్యమం నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఆ పార్టీ రాజకీయాలకు దూరంగా జీవనం కొనసాగిస్తున్నారు .
ఇది ఇలా ఉండగా, మాజీ దళ కమాండర్ కోరం గణేష్ సూచన మేరకు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు.టీఆర్ ఎస్ పార్టీ అజెండాకు ఆకర్షితుడైన తాను ఆ పార్టీలో చేరి ప్రజల తరపున పోరాడేందుకు పార్టీ ఆదేశాలకు లోబడి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
కోరం గణేష్ డి.వీరన్న రవి సమక్షంలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో హైదరాబాదులోని స్థానిక కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో బుధవారం నాడు ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్టు వివరించారు. తనతోపాటు మణుగూరు మండలం పగడేరు గ్రామం నుండి మాజీ డిప్యూటీ కమాండర్ గా పనిచేసిన రాగ. రవి( గణేష్) సిపిఎం పార్టీ అనుబంధ కుల నిర్మూలన సంఘం జిల్లా నాయకులు ముసలి రామకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం టౌన్ ఆటో యూనియన్ నాయకుడు కన్నుబాయ్ లు కవిత నాయకత్వంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారని ఒక ప్రకటనలో తెలియజేశారు .









