సీజేపీ నిరసనలే లక్ష్యంగా పాక్ కుట్ర..!

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న 480 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ ఖాతాలన్నింటికీ పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

 

ఈ ఆందోళనలపై కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన వీడియోలు, డీప్‌ఫేక్‌లు, ఎడిట్ చేసిన క్లిప్పింగ్‌లు మరియు నకిలీ పోస్టుల ద్వారా ఒక ప్రణాళికాబద్ధమైన దుష్ప్రచారం జరుగుతోందని సీనియర్ అధికారులు మీడియాకు వివరించారు. ఇటువంటి తప్పుడు సమాచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు పేర్కొన్నారు.

 

సోషల్ మీడియాలో వచ్చే ఏఐ, డీప్‌ఫేక్ మరియు ఇతర తప్పుడు పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారంలోని నిజానిజాలను గుర్తించాలని పోలీసులు కోరారు. ఏదైనా పోస్ట్, వీడియో లేదా ఫొటోను విశ్వసించే ముందు, షేర్ చేసే ముందు దాని ప్రామాణికతను నిర్ధారించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందంటూ విపక్ష నాయకులు చేసిన ఆరోపణలను పోలీసులు ఈ సందర్భంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని వారు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు