భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క యాత్ర..

ఘనంగా  పోకల దమ్మక్క యాత్ర..

పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు …

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో పోకల దమ్మక్క యాత్ర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ప్రారంభమైన ఈ యాత్ర భారీ ర్యాలీగా పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ రావు , ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం శ్రీ పోకల దమ్మక్క విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాల వేసి, ఆమె సేవలను స్మరించుకున్నారు.

అనంతరం తానిషా మండపం వెనుక ఉన్న టిటిడి కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు