కర్ణాటకలో 7 వేల మంది విద్యార్థులకు ఎయిడ్స్ ప్రచారం అబద్ధం: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

కర్ణాటకలో 7 వేల మంది విద్యార్థులు హెచ్‌ఐవీ బారిన పడ్డారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (కేఎస్ఏపీఎస్) తీవ్రంగా ఖండించాయి. ఈ వార్తలు పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేశాయి. కేఎస్‌ఏపీఎస్ అధికారులు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తూ… తాము విద్యార్థులు, గృహిణులు లేదా ఇతర వర్గాల వారీగా విడివిడిగా హెచ్‌ఐవీ బాధితుల గణాంకాలను నిర్వహించమని, కాబట్టి ఈ తప్పుడు ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో 2004 నుండి 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో మొత్తం సుమారు 39 వేల హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, ఆ పాత గణాంకాలను వక్రీకరించి కేవలం విద్యార్థులకు మాత్రమే ఆపాదించడం పెద్ద తప్పిదమని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో కాలేజీల్లో ప్రభుత్వం హెచ్‌ఐవీ పరీక్షలను తప్పనిసరి చేసిందనే వార్తలను కూడా తోసిపుచ్చారు. హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్ చట్టం 2017 ప్రకారం ఒక వ్యక్తి సమ్మతి లేకుండా వారికి పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ప్రస్తుతం తాము కేవలం కాలేజీలు, ఐటీ కంపెనీలు, పోలీస్ శాఖల్లో అవగాహన కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రతి ఏడాది 11 వేల నుంచి 12 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడం మరియు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని అధికారులు సూచించారు. ఇందుకోసం వ్యక్తిగత వివరాలు అవసరం లేకుండానే హెచ్ఐవీ రిస్క్‌ను అంచనా వేసుకునేందుకు ‘Break Free’ అనే మొబై

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు