పీకే ఓసి టు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే….

పీకే ఓసి టు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే….
ఇది పోరాటాల విజయం!
ఇది AITUC విజయం!!
సేవ్ మణుగూరు పోరాటం విజయవంతం!!!
6.5 షేర్ తో ఆక్షన్ లో
PKOC డిప్ సైడ్ బ్లాక్ సాధించుకున్న సింగరేణి సంస్థ
Today 9News ప్రతినిధి,
D రమేష్, మణుగూరు

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ Y రాంగోపాల్ ప్రకటన
మణుగూరు ఏరియాలో 2031 తర్వాత సింగరేణికి భవిష్యత్తు లేదని సింగరేణి మేనేజ్మెంట్ ప్రకటించిన నాటి నుండి సింగరేణి కార్మికులు, మణుగూరు ప్రాంతవాసులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మణుగూరు భవిష్యత్తుకి, ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తు సింగరేణి సంస్థ మనుగడకి ఎంతో కీలకమైన మణుగూరు PKOC డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి కే కేటాయించాలని పోరాట కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.
కార్మికులను కలుపుకొని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్ల వద్ద ధర్నాలు, నల్ల బ్యాడ్జిలతో నిరసనలు మెమోరాండల సమర్పణలు వంటి కార్యక్రమాలు చేశామని అన్నారు

అదేవిధంగా”” సేవ్ మణుగూరు”” అనే నినాదంతో మణుగూరు ప్రజానీకాన్ని చైతన్యం చేసి
పట్టణ వ్యాపార వాణిజ్య వర్గాలు, విద్యాసంస్థలు, ప్రెస్ అండ్ మీడియా అందర్నీ కలుపుకొని పోరాట కార్యక్రమాలు నిర్వహించాము.
జూన్ 22, 23వ తేదీలలో పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో రెండు రోజుల నిరాహార దీక్షలు, జూన్ 27వ తేదీన మణుగూరు పట్టణ బంద్ జరిగిందని.
ఉప ముఖ్యమంత్రి పీకే ఓసి టు మైన్ పర్యటనకు వచ్చినప్పుడు ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశామని, జూలై 31వ తేదీన పెద్ద ఎత్తున మణుగూరు పట్టణంలో రాస్తారోకో నిర్వహించామని,
కొత్తగూడెం ఎమ్మెల్యే గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కే రాజ్ కుమార్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి పీకే ఓసి టు డీప్ సైడ్ మైన్ సింగరేణికీ కేటాయించాలని
ఒత్తిడి తేవడం జరిగిందని
అన్నారు.
ఇది ముమ్మాటికి AITUC పోరాట ఫలితమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
రాష్ట్రంలో యాక్షన్ లో దక్కించుకున్న మొట్ట మొదటి బొగ్గు బ్లాక్ అని అన్నారు.
కేంద్రమంత్రి G కిషన్ రెడ్డి గారు మణుగూరు పర్యటనకు వచ్చినప్పుడు మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని,
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు పర్యటించినప్పుడు పీకే ఓసి 2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
నేడు ఏఐటీయూసీ పోరాట ఫలితంగా బ్లాక్ వచ్చినంక
మేమే సాధించాము అని సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారని
విమర్శించారు
ఈ విజయం సింగరేణి కార్మికుల ది, మణుగూరు పట్టణ వాసులది, వ్యాపార వాణిజ్య విద్య సంస్థలది,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సేవ్ మణుగూరు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిది అని అన్నారు.
పోరాటాల ద్వారానే విజయం సాధించవచ్చు అని
మరొక్కసారి సేవ్ మణుగూరు ఉద్యమం ద్వారా రుజువైందని గుర్తు చేశారు.
మణుగూరు ఏరియా సింగరేణి కార్మికులకు మణుగూరు వాసులకు AITUC యూనియన్ తరపున శుభాకాంక్షలు,ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మల్లెల రామ నరసయ్య, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మేకల ఈశ్వరరావు, ఆఫీస్ బేరర్స్ ఆవుల నాగరాజు, ఆదర్ల సురేందర్, గోలి గంగాధర్ రావు, సివిల్ పిట్ సెక్రటరీ రత్నం శివకుమార్, గూడూరు కృష్ణ
తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు