జనసేనలోకి ఎంట్రీపై క్లారీటీ ఇచ్చిన ఏవీ రంగనాథ్: పవన్ భూవివాదంపై వివరణ!

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వస్తి పలికారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరతానని, లేదా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. చిరంజీవి కుటుంబంతో పాటు పవన్ కల్యాణ్‌తో తనకు గత 20 ఏళ్లుగా పరిచయం, సాన్నిహిత్యం ఉందని, అంతమాత్రానికే రాజకీయ ఆరంగేట్రంపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సంబంధించిన జన్వాడ కోడికుంట చెరువు భూవివాదంపై రంగనాథ్ సాంకేతిక వివరణ ఇచ్చారు. పవన్ 2014లో 10 ఎకరాల పట్టా భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, ఆ తర్వాతే చెరువు నోటిఫికేషన్లు వచ్చాయని తెలిపారు. ఈ భూమిలో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా ఎలాంటి కబ్జాలు కానీ, నిర్మాణాలు కానీ జరగలేదని స్పష్టం చేశారు. అయితే, చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఫెన్సింగ్ (కంచె) వేయడం నిబంధనలకు విరుద్ధమని, అందుకే ఆ ఫెన్సింగ్‌ను తొలగించాలని సూచించినట్లు వెల్లడించారు.

మరోవైపు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారనే కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడేందుకు రేవంత్ రెడ్డి ဦးతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు