ఉక్రెయిన్‌పై రష్యా భీకర క్షిపణి దాడి: కీవ్‌లో 17 మంది మృతి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో 17 మంది మరణించగా, 44 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అధికారికంగా ధృవీకరించారు.

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కీవ్‌లోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులకు తెగబడింది. క్షిపణులు, డ్రోన్ల దాడి ధాటికి నగరంలో పలు నివాస భవనాలు, గిడ్డంగులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశాయి.

ఉక్రెయిన్‌కు చెందిన సైనిక రవాణా (సప్లై) కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద క్షిపణి దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు