పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్, డ్రగ్స్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం…పాల్గొన్న డీఎస్పీ రవీందర్ రెడ్డి.

Today9News ప్రతినిధి,D రమేష్ మణుగూరు
మణుగూరు వాసంతి క్రియేషన్స్ వద్ద సైబర్, డ్రగ్స్, నేరాలపై, ట్రాఫిక్ నిబంధనలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాసంతి క్రియేషన్స్ లో … పలు రాష్ట్రాలకు చెందిన మహిళలకు  డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సైబర్ క్రైమ్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. సైబర్ క్రైమ్ మోసాలుకు గురయిన క్రమంలో 1930 హెల్ప్ లైన్ సంప్రదించండి. తెలియని ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఇతరులకు పోన్ ఇవ్వద్దని మహిళకు డీఎస్పీ సూచించారు. అలాగే తెలియని లింక్స్ ను టచ్ చేయవద్దని తెలిపారు.
డీఎస్పీ రవీందర్ రెడ్డి  సూచన మేరకు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా  అందరం ఉండాలి అని వాసంతి క్రియేషన్స్ నిర్వాహకురాలు వాసంతి … అందరూ అప్రమత్తంగా ఉండాలని  తెలియచేశారు. కొన్ని, కొన్ని సందర్భాల్లో సైబర్ క్రైమ్ పట్ల జరిగిన సంఘటనలపై మహిళలకు వాసంతి వివరించారు.
కార్యక్రమం లో, సిఐ నాగబాబు,పలువురు మహిళలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు