15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరికలతో అలర్ట్

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో వాతావరణ శాఖ (IMD) 15 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
వర్షాల ఉధృతికి వాగులు, వంకాలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల కారణంగా రైలు, విమాన రాకపోకలకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు