మెటాకు US కోర్టు భారీ షాక్: రూ.5,400 కోట్ల జరిమానా విధించిన న్యూమెక్సికో న్యాయస్థానం

సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ) పై అమెరికాలోని న్యూమెక్సికో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్న పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున మెటా సంస్థకు $567 మిలియన్ల (సుమారు రూ. 5,400 కోట్లు) భారీ జరిమానా విధించింది. యంగ్ యూజర్లను తమ యాప్‌లకు బానిసలుగా మార్చేలా అల్గారితమ్‌లు రూపొందించారని, అలాగే లైంగిక వేధింపులు, దోపిడీ నుండి పిల్లలను కాపాడటంలో సంస్థ విఫలమైందని న్యూమెక్సికో అటార్నీ జనరల్ రాల్ తోరెజ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ తీర్పులో భాగంగా వసూలు చేసే మొత్తంలో $420 మిలియన్లను సోషల్ మీడియా ప్రభావంతో మానసికంగా దెబ్బతిన్న పిల్లల వైద్య చికిత్సకు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన నిధులను రాబోయే ఐదేళ్లలో పిల్లల్లో అవగాహన పెంపొందించడం, భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ మరియు నివారణ చర్యల కోసం ఉపయోగించాలని స్పష్టం చేసింది.

అంతేకాకుండా, 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారుల సమాచారాన్ని సేకరించకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. దీనితో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేక భద్రతా స్క్రీన్‌లు, వయస్సు నిర్ధారణ సాధనాలు (Age Assurance Tools) ప్రవేశపెట్టాలని, విద్యార్థుల భద్రతను పర్యవేక్షించడానికి పాఠశాలలతో కలిసి పని చేసే ప్రత్యేక పోర్టల్స్ ఏర్పాటు చేయాలని మెటాను ఆదేశించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు