సింగవరంలో చేపల పెంపకం యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం : ఆగస్టు 10…
దుమ్ముగూడెం మండలం, సింగవరం గ్రామంలో గ్రామీణాభివృద్ధి సంస్థ, భద్రాద్రి క్రాంతి విలాస్ మండల సమైక్య నిర్మాణం సౌజన్యంతో ఏర్పాటు చేసిన *“లక్ష్మి కొరమీను చేపల పెంపకం యూనిట్”* ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం చేపలకు మేత వేసి, యూనిట్ విలువ 4,41,000రూ,,లతో PMEGP లోన్ తీసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించారని తెలిపారు. గ్రామీణ మహిళలు, స్థానికులకు చేపల పెంపకం ద్వారా ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









