Public Wi-Fi Risks: ఉచిత వై-ఫైతో జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే సైబర్‌ ముప్పు తప్పదు

ప్రయాణ సమయంలో విమానాశ్రయాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, కేఫ్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లు వంటి ప్రదేశాల్లో ఉచిత పబ్లిక్‌ Wi-Fi అందుబాటులో ఉంటుంది. మొబైల్‌ డేటాను ఆదా చేసుకోవడానికి చాలామంది వెంటనే ఈ నెట్‌వర్క్‌లకు కనెక్ట్‌ అవుతుంటారు. అయితే, పబ్లిక్‌ Wi-Fiని ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. తెలియని వ్యక్తులతో ఒకే నెట్‌వర్క్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల సైబర్‌ భద్రతకు సంబంధించిన కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

పబ్లిక్‌ Wi-Fi నెట్‌వర్క్‌లలో నకిలీ హాట్‌స్పాట్‌లు, డేటా దొంగతనం, ఫిషింగ్‌ దాడులు, మాల్వేర్‌ వంటి ముప్పులు ఉండొచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని పబ్లిక్‌ నెట్‌వర్క్‌లో యాక్సెస్‌ చేయడం ప్రమాదకరం. అందుకే అత్యవసరం అయితే తప్ప సున్నితమైన లావాదేవీలకు పబ్లిక్‌ Wi-Fiని ఉపయోగించకపోవడం మంచిది.

అలాగే అవసరం లేని సమయంలో Wi-Fiని ఆఫ్‌ చేయడం, నెట్‌వర్క్‌ పేరు అధికారికమైనదేనా అని సిబ్బందిని అడిగి నిర్ధారించుకోవడం, డివైస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు మొబైల్‌ డేటా లేదా విశ్వసనీయమైన హాట్‌స్పాట్‌ను ఉపయోగించడం ద్వారా పబ్లిక్‌ Wi-Fi వల్ల వచ్చే సైబర్‌ ముప్పులను తగ్గించుకోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు