భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ (లోక్‌భవన్)లో తెలంగాణ గవర్నర్ సంప్రదాయ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు వీఐపీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీగా వాహన రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీ. జోయల్ డేవిస్ పలు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లను ప్రకటించారు.
రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కార్యక్రమం జరిగే సమయంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.









