హైదరాబాద్‌లో గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా.. దారుణాలు వెలుగులోకి

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్‌కు సంబంధించిన ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరేళ్లుగా రహస్యంగా డెడ్ డ్రాప్ పద్ధతిలో సుమారు 203 మంది కస్టమర్లకు గంజాయి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ముఠా ప్రధానంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో నిందితులు మరిన్ని నేరాలకు పాల్పడినట్లు విచారణలో ఆరోపణలు వెలువడ్డాయి. వరంగల్‌తో పాటు ఇతర మారుమూల ప్రాంతాల నుంచి మైనర్లు, పేద యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి తమ వద్ద ఉంచుకున్నట్లు, వారిపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాధితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.

బాధితులు గర్భం దాల్చిన సందర్భాల్లో వారిపై దాడులు చేయడంతో పాటు, ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా ప్రమాదకర పద్ధతుల్లో అబార్షన్లు చేయించినట్లు కూడా విచారణలో సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ ఆరోపణలు కేసు తీవ్రతను మరింత పెంచాయి. ముఠా కార్యకలాపాలు, నిందితులపై ఉన్న ఇతర కేసులు, బాధితుల వివరాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు