Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు..
మణుగూరు లోని బాలికల అనాధ శరణాలయంలో చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా వారికి కావలసిన సౌకర్యాలు కల్పించడం జరిగిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.
ఈనెల 20 తేదీ నాడు బాలికల అనాధ శరణాలయాన్ని ఆకస్మిక తనకి సమయంలో అక్కడ పిల్లలకు సరిపడా భోజన బల్లలు (డైనింగ్ టేబుల్స్) మరియు కుర్చీలు లేవని, శరణాలయంలో కనీస వసతులను మెరుగుపరచడానికి మరికొన్ని ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరమని గమనించానని, వెంటనే పరిగణనలోకి
తీసుకొని అవసరమైన భోజన బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు మరియు ట్యూబ్ లైట్లను సాయంత్రం నాటికి ఏర్పాటు చేయాలని మణుగూరు తహసీల్దార్ నరేష్‌ను ఆదేశించడం జరిగిందని,అదే రోజు పిల్లల ఇష్టానుసారం వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేయాలని ఆయన తహసీల్దార్‌కు సూచించడం జరిగిందని అన్నారు.
తక్షణమే స్పందించిన మణుగూరు తహసీల్దార్ నరేష్ బృందం, సాయంత్రం కల్లా అవసరమైన వసతులను మరియు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారని అన్నారు.
సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించడంలోనూ, పిల్లలకు అందుబాటులో ఉన్న వసతులను మెరుగుపరచడంలోనూ తహసీల్దార్, బృందం చూపిన అంకితభావం, తక్షణ స్పందన మరియు వేగవంతమైన చర్యలను పరిగణలోకి తీసుకొని వారిని అభినందించడం జరిగిందని అన్నారు.
సబ్ కలెక్టర్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలోని చిన్నవైనప్పటికీ ముఖ్యమైన సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరించేందుకు తమ పరిధిలో ఇదే తరహా చొరవ చూపాలని ఆయన ఇతర అధికారులను కోరారు.
సకాలంలో జోక్యం చేసుకోవడం, బాధ్యతాయుతమైన యంత్రాంగం ద్వారా పిల్లలు, విద్యార్థుల సంక్షేమాన్ని, వసతులను మెరుగుపరచడంలో అర్థవంతమైన మార్పును తీసుకురావచ్చని ఆయన అన్నారు.









