67వ ఏట అడుగుపెట్టిన నాగార్జున.. యంగ్‌గా కనిపించేందుకు ఆయన పాటించే ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇవాళ 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయస్సులోనూ ఎంతో యవ్వనంగా, ఫిట్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటారు? ఆయన పాటించే డైట్, జీవనశైలి సీక్రెట్స్ ఏంటి? అనే విషయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు, కోట్లు ఖర్చు చేయడం కంటే.. ముందుగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమని నాగార్జున సూచించారు. కేవలం ‘మన్మధుడు’ అనే బిరుదును నిలబెట్టుకోవడం కోసం లేదా గ్లామర్ కోసం తాను ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మానసికంగా కూడా ఎల్లప్పుడూ బలంగా ఉండేందుకు ఫిట్‌నెస్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.

శారీరక ఆరోగ్యంతో పాటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఫిట్‌నెస్ కీలకమని నాగార్జున అభిప్రాయపడ్డారు. వయస్సు పెరిగినా చురుగ్గా, ఉత్సాహంగా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని ఆయన చెప్పిన మాటలు అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అందుకే 67వ ఏట కూడా నాగార్జున ఫిట్‌నెస్, యంగ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు