ఇన్‌ఫ్రా దిగ్గజం, ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్‌ రాజు కన్నుమూత..

భారత మౌలిక వసతుల రంగంలో తనదైన ముద్ర వేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపక చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్‌ రాజు – 90) హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో 1937 ఏప్రిల్ 18న జన్మించిన ఆయన, కేవలం 19 ఏళ్ల వయసులోనే వాణిజ్య రంగంలో ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1978లో ఎన్‌సీసీని స్థాపించి, అంచెలంచెలుగా దేశంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారు. నాణ్యతలో రాజీపడకపోవడం, చేపట్టిన ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే తమ విజయ రహస్యమని ఆయన తరచూ పేర్కొనేవారు.
దేశవ్యాప్తంగా సాగు, తాగునీటి పథకాలు, భారీ భవనాలు, రైల్వే మార్గాలు, గనులు, విద్యుత్ సరఫరా–పంపిణీ వంటి కీలక రంగాల్లో ఎన్‌సీసీ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించింది. మౌలిక రంగ విస్తరణకు ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయన్ను ‘పద్మశ్రీ’తో గౌరవించింది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయనను సత్కరించాయి. వ్యాపార విలువలలోనూ, సామాజిక సేవలోనూ ఆయన వేసిన బాటలోనే ముందుకు సాగుతామని ఎన్‌సీసీ ప్రతినిధులు ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు