Lava Bold N4 Lite: బడ్జెట్ ఫోన్‌లో మిలిటరీ గ్రేడ్ రక్షణ.. లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. Lava Bold N4 Lite పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెజాన్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ రేటింగ్ ఉండనుంది. అంటే డ్రాప్స్, షాక్స్ వంటి పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. గోల్డ్ కలర్‌లో ఫోన్ డిజైన్‌ను టీజ్ చేసింది. వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్, కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు, దిగువన USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నాయి.

Lava Bold N4 Lite విక్రయాలు అమెజాన్ ద్వారా జరగనున్నాయి. అయితే ఫోన్ ధర, RAM, స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే కొన్ని లీకుల్లో ధర, ఫీచర్లపై అంచనాలు వచ్చినప్పటికీ.. అసలు ధర, పూర్తి స్పెసిఫికేషన్ల కోసం ఆగస్టు 27న జరిగే అధికారిక లాంచ్ వరకు వేచి చూడాల్సిందే.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share