సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలకు కొండా సుస్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలి

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావులేదు: ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్

ఆగస్టు 22 :: TODAY9NEWS…

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన కొండా సుస్మిత వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం కారేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా రాందాస్‌ నాయక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ తాము మాట్లాడే మాటలకు బాధ్యత వహించాలని సూచించారు.

ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు కొండా సుస్మిత బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కాంగ్రెస్‌ అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుతూ రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాందాస్‌ నాయక్‌ సూచించారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అన్నారు.

విలేకరుల సమావేశంలో దిశా కమిటీ సభ్యురాలు హేమలత, బాలాజీ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయక్, సీనియర్‌ నాయకులు అడ్డగోడ ఐలయ్య, వినోద్‌ నాయక్, మేదరి టోనీ, వీర ప్రతాప్‌ తదితర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు