ముత్యాలమ్మ  బోనాల వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

ముత్యాలమ్మ  బోనాల వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ, ఆగస్టు 23:

​కోదాడ పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా అమ్మవారికి బోనం ఎత్తుకొని పట్టువస్త్రాలు, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, స్థానిక వార్డు కౌన్సిలర్ షాబుద్దీన్, ఇతర కౌన్సిలర్లు వార్డు ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు