‘చేయూత’ పెన్షన్‌ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన వారు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ‘చేయూత’ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గడువు పొడిగించినట్లు తెలిపారు. సర్వర్ సమస్యలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో అర్హత ఉన్నప్పటికీ పలువురు దరఖాస్తు చేసుకోలేకపోయారని పేర్కొన్నారు.

ముఖ్యంగా సదరం సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు