Today9TV News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
ఎస్బి టిఇటి నీ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని డిమాండ్.
మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన. సేవ్ పాలిటెక్నిక్, సేవ్ అవర్ ఫ్యూచర్ అనే నినాదం ప్లే కార్డులతో ప్రదర్శన. ఎస్బి టిఇటి స్కిల్ యూనివర్సిటీ లో పాలిటెక్నిక్ విద్యార్థులను విలీనం చేయవద్దని విద్యార్థులు డిమాండ్..
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తా…. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు చేరుకున్న శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. వినతిపత్రం అందజేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు, విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింప చేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు..
Post Views: 26









