Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సంబంధించి గత కొన్ని రోజులుగా కోచింగ్ తీసుకున్న విద్యార్థిని విద్యార్థుల ప్రవేశ పరీక్ష చైతన్య పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నారు.
ఈ ప్రవేశ పరీక్షలకు నాలుగు మండలాల నుండి 201 మంది నిరుద్యోగులు హాజరయ్యారు, పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు, ఈ పరీక్షలను సీఐ నాగబాబు పర్యవేక్షిస్తున్నారు.
నిరుద్యోగులకు అవసరమైన ఉచిత రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, ఈ పరీక్షలు 201 మంది నిరుద్యోగులు హాజరయ్యారని డిఎస్పి రవీందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని డీఎస్పీ రవీందర్ రెడ్డి వివరించారు.
Post Views: 14









