అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు “మట్టి వినాయకుడిని” అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు “మట్టి              వినాయకుడిని” అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

మట్టి వినాయకుల వినియోగంపై ప్రజల్లో అవగాహన            కల్పిస్తున్న బీసీ సంక్షేమ శాఖ…

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వినాయక చవితి సందర్భంగా రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని బీసీ సంక్షేమ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

 

ఈ సారి జరిగే వినాయక చవితి ఉత్సవాలకు మట్టి వినాయకులను అందించడం పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, బీసీ సంక్షేమ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

మట్టి వినాయకుల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలందరూ పర్యావరణహితమైన మట్టి గణపతులను వినియోగించి వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు