టాలీవుడ్‌లో చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతోంది: షిరాజ్ మెహదీ

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ మరోసారి స్పందించారు. టాలీవుడ్‌లో మాఫియా తరహా వ్యవస్థ కొనసాగుతోందని, చిన్న నిర్మాతలు, దర్శకులు మోసం, దోపిడీ, వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తాను నిర్మించి, హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులు వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.

తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో షిరాజ్ మెహదీ మాట్లాడుతూ.. మంచి సాంకేతిక నిపుణుల సహకారంతో ఎంతో కష్టపడి ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను నిర్మించామని తెలిపారు. తమ చిత్రానికి తగినన్ని థియేటర్లు కేటాయించి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే మంచి విజయాన్ని సాధించే సత్తా ఉందని అన్నారు. అయితే, పెద్ద సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న చిత్రాలను పక్కన పెడుతున్నారని, విడుదల సమయంలో థియేటర్లు దొరకకపోవడం చిన్న నిర్మాతలకు ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు.

చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశ్రమ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే 40కి పైగా ప్రెస్‌మీట్లు నిర్వహించానని, 50కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చానని షిరాజ్ మెహదీ వెల్లడించారు. చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు